ఆంధ్రుల ఘన కీర్తి.. నేడు భోగరాజు పట్టాభి సీతారామయ్య జయంతి.. 

Suma Kallamadi

ప్రజలకు పొదుపును నేర్పడం.. వ్యవసాయదారులకు రుణాలు ఇవ్వాలన్న లక్ష్యంతో ప్రకాశం జిల్లాకు చెందిన భోగరాజు పట్టాభి సీతారామయ్య శాతాబ్ధం క్రితమే ఆంధ్రా బ్యాంక్ స్థాపించడం జరిగింది. ఆ రోజుల్లోనే ఆర్థికరంగంపై అపార మేధసంపతి కలిగిన ఆయన ప్రజల ఆర్థిక జీవన విధానాన్ని మార్చాలని సీతారామయ్య సంకల్పించారు. ఆంధ్రాబ్యాంకు ద్వారా వ్యవసాయదారులకు రుణాలిచ్చి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడినాడు.  అలా 1923లో ఆంధ్రా బ్యాంకుకు పునాది పడి నేటికీ భారత దేశంలో నంబర్ వన్ స్థాయిలో ముందుకు కొనసాగుతుంది.

 


 
నవంబర్ 24న ఆయన జయంతి సందర్భంగా.....  భోగరాజు పట్టాభి సీతారామయ్య 1880 నవంబర్ 24న పశ్చిమ గోదావరి జిల్లా గుండుగోలను గ్రామంలో జన్మించారు. ఎంబీబీఎస్ చదివి 1906 -16 మధ్యకాలంలో మచిలీపట్నంలో వైద్యవృత్తిని నిర్వహించారు. గాంధీజీ సిద్ధాంతాలకు కట్టుబడి వైద్యాన్ని వదిలి స్వాతంత్రోద్యంలో ప్రవేశించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని మూడేళ్లు జైలు జీవితం కూడా గడిపారు. 

తెలుగు భాషా కోసం ఆయన విశేషకృషి చేశారు. తాను స్థాపించిన వ్యాపార సంస్థల్లోనూ పూర్తిగా తెలుగులోనే సేవలు అందించేవారు. 1908లోనే బందరులో తొలిసారి తెలుగు జిల్లాల ప్రముఖులకుతో సదస్సు నిర్వహించారు. ఆయన దేశంలో ఎక్కడున్నా చివరి శ్వాస వరకు తెలుగు బాషా సంప్రదాయాలను వీడకుండా జీవించారు. బందరు జాతీయ కళాశాల వ్యవస్థాపకులలో వీరు ఒకరు.   

19948లో స్వాతంత్రానంతరం జరిగిన తొలి జాతీయ కాంగ్రెస్ సదస్సుల్లో అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎదిగి 1948 -50 వరకు పని చేశారు. 1952-57 కాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా సేవలందించారు. 1959 డిసెంబర్ 17న కన్నుమూశారు. 

 

ప్రభుత్వ రంగ బ్యాంకుల విభాగంలో 2010 సంవత్సరానికి ఆంధ్రా బ్యాంక్ ఉత్తమ బ్యాంక్ గా బ్యాంకింగ్ ఎక్సలెన్స్ అవార్డు పొందింది. స్టేట్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకర్స్ (కేరళ) ఈ అవార్డును అందజేసింది. ప్రారంభం నుంచినేటి వరకు మొత్తం ఋణాలలో కనీసం 50 శాతానికి తగ్గకుండా ఋణాలను గ్రామీణ భారతానికే అందిస్తున్నబ్యాంక్ ఇది. దేశంలో బ్యాంకుల జాతీయం చేసిన తర్వాత క్రమబద్దంగా నడుస్తున్న జాతీయ బ్యాంకులలో ఇది ప్రధానమైనది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: